Tuesday, November 5, 2024

యుపి సిఎం ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామని బెదరింపు సందేశం ఇచ్చిందన్న ఆరోపణపై 24 ఏళ్ల మహిళను ముంబయి పోలీసుల అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. ఫాతిమా ఖాన్‌గా గుర్తించిన ఆ మహిళ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో బిఎస్‌సి చేసిందని, ఆమె తన కుటుంబ సభ్యులతో కలసి మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని ఉల్హాస్‌నగర్ ప్రాంతంలో నివసిస్తుంటుందని అధికారి తెలియజేశారు. ఆమె తండ్రి కలప వ్యాపారం చేస్తుంటారని ఆయన చెప్పారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు అని, కానీ మానసిక స్థితి సవ్యంగా లేదని పోలీసులు తెలిపారు. ఆదిత్యనాథ్ పది రోజుల్లోగా సిఎం పదవికి రాజీనామా చేయని పక్షంలో ఎన్‌సిపి నేత బాబా సిద్ధిఖి వలె ఆయనను

హతమారుస్తామని బెదరిస్తూ అజ్ఞాత నంబర్ నుంచి ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు శనివారం ఒక సందేశం వచ్చినట్లు అధికారి తెలియజేశారు. ఫాతిమా ఖాన్ ఆ సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నట్లు ఆయన తెలిపారు. ముంబయి ఎటిఎస్ బృందం ఉల్హాస్‌నగర్ పోలీసులతో కలసి సాగించిన గాలింపు జరిపి, ఆ మహిళ ఆచూకీ తీసి అరెస్టు చేసినట్లు అధికారి వివరించారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిమిత్తం ఆదిత్యనాథ్ రాష్ట్రానికి రావచ్చు కనుక పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News