Friday, December 27, 2024

మంచి అనుభూతినిచ్చే సినిమా ‘రహస్యం ఇదం జగత్’

- Advertisement -
- Advertisement -

సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్‌గా రూ పొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. మన పురాణాలు, ఇతిహాసాల గురించి.. శ్రీచక్రం గురిం చి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం ఇది. ఈనె ల 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూ పొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం లో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చి త్రం కథానాయికలు స్రవంతి ప్రత్తిపాటి, మాసస వీణలు ఆదివారం పాత్రికేయుల తో ముచ్చటించారు.

మానస వీణ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో అరుణి ఆచార్య అనే పాత్ర చేశాను. ఈ కథ వినగానే సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీని కనెక్ట్ చేసి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సినిమా నేపథ్యం వుండటం నన్ను ఆకర్షించింది. నాకు చిన్నప్పటి నుండి హ్యా రిపోటర్ కథలు విన్నాను. రామాయాణ, మహాభారతంలు కూడా చదివాను. ఈ చిత్రంలో నా పాత్ర కోసం నేను రీసెర్చ్ కూడా చేశాను. మా తాత గారు అలీ బాబ నలభై దొంగలు అనే సినిమాను నిర్మించారు. అలా నాకు కాస్త సినిమా నేపథ్యం కూడా వుంది. దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ సినిమా పట్ల ఎంతో పాషన్ వున్న వ్యక్తి. తప్పకుండా ఈ చిత్రం కోమల్ దర్శకత్వ ప్రతిభను నిరూపిస్తుంది. సినిమా చిత్రీకరణ మొత్తం యూఎస్‌లోనే జరిగింది’ అని అన్నారు.

స్రవంతి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు అకిరా. అమెరికాలో జాబ్ చేస్తున్న నేను ఈ సినిమా నుండి పూర్తి స్థాయిలో సినిమాలపై శ్రద్ద పెట్టాను. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ నాకు తాత వరుస అవుతాడు. ఆయన సలహాలు సూచనలు నా కెరీర్ కోసం తీసుకున్నాను. ఈ చిత్ర కాన్సెప్ట్‌తో పాటు ట్రైలర్ కూడా నచ్చింది. హనుమంతుడు వేరే లోకలకు ట్రావెల్ చేసినప్పుడు అసలు జరిగిందేమిటి అనేది కథలో టైమ్ ట్రావెల్‌లో ఏం జరిగింది కూడా ఈ కథలో చర్చకు వచ్చింది. ఈ చిత్రం కోసం దర్శకుడు కోమల్ ఎంతో కష్టపడ్డాడు. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ఈ సినిమా ఇస్తుందని నమ్ముతున్నాను‘ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News