బ్రాంప్టన్: కెనడాలో హిందువుల మందిరంపై ఖలిస్థానీలు దాడి చేయడాన్ని కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఖండించారు. ఖలిస్థానీ తీవ్ర వాదులు ‘రెడ్ లైన్ ను క్రాస్ చేశారు’ అన్నారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంపై ఖలిస్థానీ తీవ్రవాదులు ఇటీవల జరిపిన దాడిని ప్రతిపక్ష నాయకుడు పియరీ పొయిలీవ్రే, టొరంటో ఎంపీ కెవిన్ వూంగ్ , ఎంపీ చంద్ర ఆర్యతో సహా కెనడా రాజకీయ నాయకులు విస్తృతంగా ఖండించారు. హిందువులను రక్షించడంలో మన దేశ(కెనడా) నాయకులు విఫలమయ్యారని టొరంటో ఎంపీ అన్నారు. ఆలయంలో హిందువులపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. పటిష్టమైన భద్రతా చర్యలను అందించాలని కెనడియన్ అధికారులను చాలా ముందుగానే అభ్యర్థించింది.
దాడుల తర్వాత, కెనడాలోని హిందూ సమాజం కోసం పనిచేస్తున్న హిందూ కెనడియన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆలయంపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఖలిస్తాన్ తీవ్రవాదులు మహిళలు , పిల్లలను కొట్టడం వీడియోలో కనిపించింది.
It's absolutely unacceptable how Khalistani Goons were able to attack innocent Women and Child at the Hindu Sabha Mandir, even though the police were at the scene. ZERO ARRESTS were made so far. #hindulifematters #hindusabha #HinduSabhaMandir pic.twitter.com/k6upzJN5Wa
— Gurkiran Brar 🪯 (@UnfilteredSevak) November 3, 2024