Tuesday, November 5, 2024

పెట్టుబడి మోసం డబ్బు రూ. 1.05 కోట్లు రీఫండ్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎక్కువ రాబుడులు వస్తాయని నమ్మించి పెట్టుబడి పెట్టించిన మోసగాళ్ల నుంచి డబ్బును బాధితుడికి తిరిగి ఇప్పించిన హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ నవంబర్ 3న రూ. 1.05 కోట్లను ఓ వ్యక్తికి తిరిగి దక్కేలా  చేసింది. బాధితుడు ఓ ప్రయివేట్ ఉద్యోగి. మంచి రాబడి వస్తుందని ఆశచూపి మోసగాళ్లు అతడిని వంచించారు. వారి మాటలు నమ్మి ఆ వ్యక్తి మోసగాళ్ల బ్యాంకు ఖాతాకు రూ. 1,22,26,205 ట్రాన్స్ఫర్ చేశాడు.

సైబర్ క్రైమ్ యూనిట్ ఐటి చట్టం తాలూకు 66(సి), 66(డి) సెక్షన్లు, ఇండియన్ పినల్ కోడ్ 319(2), 318(4),338,340(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాక కోర్టులో పిటిషన్ వేయడంలో కూడా బాధితుడికి సహకరించారు.   ఆ తర్వాత కోర్టు ఉత్తర్వు పొందాక రూ. 1,05,00,000 తిరిగి ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News