- Advertisement -
టీమిండియా సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సాహా వెల్లడించాడు. ఈ రంజీ సీజనే తన కెరీర్‌లో చివరిదని స్పష్టం చేశాడు. 40 ఏళ్ల సాహా 2010లో అంతర్జాతీయ క్రికెట్ శ్రీకారం చుట్టాడు. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఐపిఎల్‌లోనూ వివిధ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. 2021లో వాంఖడే వేదికగా కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో సాహా 1300 పరుగులు చేశాడు. టెస్టుల్లో మూడు సెంచరీలు నమోదు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో సాహాకు మెరుగైన రికార్డు ఉంది. ఏడు వేలకు పైగా పరుగులు సాధించిన సాహా 14 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపిఎల్‌లో 170 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఓ సెంచరీ, మరో 13 అర్ధ సెంచరీలు సాధించాడు. ఐపిఎల్‌లో సాహా 2,934 పరుగులు చేశాడు.
- Advertisement -