Sunday, November 24, 2024

బయటపడుతున్న ‘చెక్ మేట్‘ కన్సల్టెన్సీ మోసాలు

- Advertisement -
- Advertisement -

మెడికల్, ఇంజనీరింగ్ సీట్లను ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రోహిత్ అలియాస్ చిన్ను, దినేష్ (బిట్టు). భవాని శంకర్, కామేష్, నదీముద్దీన్ కలిసి చెక్‌మేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్లను ఇప్పిస్తామని పలువురు బాధితులకు చెప్పారు. దీంతో చాలామంది విద్యార్థులు డబ్బులు చెల్లించారు, కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేసిన నిందితులు సీట్లు ఇప్పించలేదు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భవానీ శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్ డేటా, బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించగా మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.

నిందితులకు ఓ బాడీ బిల్డర్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. కానీ ఇప్పటికీ ప్రధాన నిందితుడు రోహిత్ పరారీలో ఉన్నాడు. ఈ స్కాంలో నదీముద్దిన్ సయిద్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. గతంలో రోహిత్ ముఠా కు డ్రగ్స్, బంగారం తదితర వ్యవహారాలతో సంబంధాలు ఉన్నాయని బాధితులపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో వెంగళరావునగర్‌లో రెండున్నర ఏళ్లపాటు కొనసాగిన చెక్ మేట్ సంస్థ..అక్కడ కూడా వందలాది మందిని మోసం చేసినట్లు తెలిసింది. రోహిత్ అలియాస్ చిన్నూ ముఠాపై జూబ్లీహిల్స్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నిందితుల వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News