Tuesday, November 5, 2024

స్విగ్గిని కోర్టుకు లాగి రూ.35వేల పరిహారం పొందిన హైదరాబాదీ

- Advertisement -
- Advertisement -

వినియోగదారుడిని మోసం చేసినందుకు 35 వేల రూపాయల పరిహారం, ఆయన ఆర్డర్ ఇచ్చిన రూ. 350 బిల్లు కూడా వెనక్కి ఇచ్చేయాలని రంగారెడ్డి జిల్లాలోని వినియోగదారుల న్యాయస్థానం స్విగ్గీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన బాబు అనే వ్యక్తి స్విగ్గి యాప్‌లో స్విగ్గి వన్ అనే స్కీమ్ ను ఎంచుకున్నాడు. ఈ స్కీమ్ ప్రకారం ఆయనకు ఫ్రీ డెలివరీ చేయాల్సి ఉంది. పధ్నాలుగు కిలోమీటర్ల లోపు రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ ఇస్తే ఫ్రీ డెలివరీ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఫ్రీ డెలివరీ ఉంది కదా అని బాబు అనే వ్యక్తి ఓ మంచి రెస్టారెంట్ నుంచి తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. దానికి రూ.350 ఖర్చు అయింది.

ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత చూస్తే రూ. 103 రూపాయలు డెలివరీ ఫీజు ఉంది. ఇదేదో పెద్ద మోసమనుకున్న ఆయన దీన్ని ఇలా వదిలి పెట్టకూడదని కోర్టుకు వెళ్లారు. స్విగ్గి మోసం చేసిన వైనాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. కోర్టు కేసు నమోదు చేసుకుని విచారణకు రావాలని స్విగ్గికి ఆదేశాలు జారీ చేసింది. కానీ స్విగ్గి నుంచి ఎవరూ రాలేదు. ఇలా రెండు, మూడు వాయిదాలు చూసిన తర్వాత న్యాయమూర్తి తప్పు చేసినందునే వాదనలు వినిపించడానికి రావడం లేదని నిర్దారించి రూ.35వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్డర్ ఇచ్చిన డబ్బులు కూడా రిఫండ్ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News