Saturday, November 23, 2024

అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

కెనడాపై జైశంకర్ తీవ్ర ఆగ్రహం
ఆ దేశం నిరాధార ఆరోపణలు చేస్తోంది
భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టింది

కాన్‌బెర్రా : కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ శాఖ మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కెనడాలో ఒక హిందు దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేసిన విషయం విదితమే. ఆ దాడి నేపథ్యంలో జైశంకర్ తీవ్రంగా స్పందించారు. కెనడాపై తాను మూడు విషయాలు చెప్పాలని అనుకుంటున్నానని, ఒకటి నిరాధార ఆరోపణలు చేస్తోందని, రెండవద భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టిందని, అది సబబు కాదని కేంద్ర మంత్రి అన్నారు.

మూడవది మనం అంతా చూస్తున్నామని, అందుకు ఆ వీడియోనే సాక్షమని ఆలయంపై దాడి ఘటనను ఉద్దేశించి జైశంకర్ చెప్పారు. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారనేది స్పష్టం అవుతోందని ఆయన విమర్శించారు. కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలసి విలేకరుల గోష్ఠిలో పాల్గొన్న జైశంకర్ కెనడాలోని తాజా సంఘటన. ఆ దేశంతో ప్రస్తుతం సాగుతున్న దౌత్య వివాదంపై ప్రశ్నలకు సమాధానంగా ఆ వ్యాఖ్యలు చేశారు.

కాగా, అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ దేశంలో భారత్‌కు సత్సంబంధాలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో సహా గత ఐదు ప్రభుత్వాల హయాంలో ఆ దేశంతో భారత్ మంచి సంబంధాలు కొనసాగించిందని ఆయన వెల్లడించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉభయ దేశాల మధ్య స్నేహం పురోగతి సాధిస్తుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News