Sunday, November 24, 2024

పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకెళుతున్నాం

- Advertisement -
- Advertisement -

పర్యాటక రంగంపై సిఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ప్రారంభం
లండన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక రంగపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్లుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని తెలిపారు.

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ఆవిర్బావిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం – పర్యాటక రంగానికి మేలు చేసే అవకాశాలు అనే థీమ్ తో లండన్ వేదికగా ఎక్సెల్ హాల్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ (ప్రపంచ పర్యాటక ప్రదర్శన)లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో తెలంగాణ పర్యాటక స్టాల్‌ను మంత్రి తదితరులు ప్రారంభించారు. అనంతరం ఇన్‌క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు.

లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్‌తో మంత్రి జూపల్లి భేటి అయ్యారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్‌లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణలో టూరిజం అభివృద్ధికి, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను, తెలంగాణ పర్యాటక ప్రదేశాల గురించి వారికి వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగా 125 దేశాలు, భారత్ నుంచి 10 పైగా రాష్ట్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించేలా తెలంగాణ పర్యాటక అందాలు, చారిత్రక ప్రదేశాల ఛాయచిత్రాలను డిజిటల్ స్క్రీన్ లో పర్యాటక శాఖ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News