Wednesday, November 6, 2024

ప్రముఖ జానపద గాయకురాలు శారదా సిన్హా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రముఖ జానపద గాయకురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత శారదా సిన్హా(72) కన్నుమూశారు. శారద గత కొంత క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆమె కుమారుడు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 2017లో ఆమెకు బోన్ మ్యారో క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో అక్టోబర్ 25 ఎయిమ్స్ ఆస్పత్రిలో చేశారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. శారద మృతిపట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొన్న దశాబ్ధాలుగా మైథిలి, భోజ్‌పూరిలో పోక్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాగారు. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు మోడీ బాధను వ్యక్తం చేశారు. ఛత్‌ పండుగలో ఆమె మధురమైన పాటలు ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తు ఉంటాయని చెప్పారు. శారదాను బీహార్ కోకిల అని పిలుస్తారు.  వివాహ్ గీత్, ఛత్ గీత్ లో పాటలు పాడడంతో ప్రముఖ గాయకురాలిగా ప్రఖ్యాతి చెందారు. బిహార్ రాష్ట్రం సుపౌలి జిల్లాలోని హులాస్ 1952 అక్టోబర్ 1న జన్మించారు. పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులను స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News