Wednesday, November 6, 2024

వరి దిగుబడిలో నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

150లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనున్న దిగుబడి
10 నెలల్లో 11,537.40కోట్ల రుణభారం మాఫీ
ధాన్యం కొనుగోలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రైస్‌మిల్లర్లు సహకరించాలి పార్టీ నేతలతో జరిగిన
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారత దేశంలోనే రికార్డ్ స్థాయిలో ధా న్యం దిగుబడి వచ్చిన సందర్భం ముందెన్నడూ లే దని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొన్నం ప్రభాకర్‌లతో పాటు లోకసభ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులతో మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరా వు రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పౌర సరఫరాల ము ఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 150 లక్షల ధాన్యం దిగుబడి ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. 60.80 లక్షల ఎకరాల్లో ప్రభుత్వం అంచనా వేస్తు న్న దిగుబడిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. అం దులో 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలుగా,44 లక్షలు దొడ్డు రకం ఉంటాయన్నారు. ఖరీఫ్ నుండి సన్నాలకు బోనస్‌గా క్వింటా ఒక్కింటికి 500 రూ పాయలు ప్రకటించిన నేపధ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపారన్నారు. దిగుబడిలో సన్నాలు 47 లక్షల అంచనాయే ఇందుకు నిదర్శనమన్నా రు. ఈ మొత్తం కొనుగోలుకు గాను 30 వేల కోట్లు అవుతుందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికే 20వేల కో ట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో అధికారు లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించా రు. అదే సమయంలో రైతులు అయోమయంలో పడకుండా ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతాంగంలో అవగాహన కల్పించాలని మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. కొనుగోలులో ఎక్కడా రాజీ పడేది లేదని, ముమ్మాటికీ ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రై తులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. అత్యధికంగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి ఆయిన నేపధ్యంలో ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి పరీక్షా కాలమని, ఇం దులో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కా వాలని ఆయన కోరారు. ప్రజాప్రతినిధులు ఏమరుపాటుతో వ్యవహరించి ఎక్కడికక్కడ ధాన్యం కొ నుగోళ్లు పకడ్బందీగా జరిగేలా చూడాలని ఆయన చె ప్పారు. ప్రభుత్వానికి ఎక్కడా అప్రతిష్ట రాకుండా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు.

32 జిల్లాల్లో 7572 కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7572 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.తెలంగాణ బియ్యానికి బీహార్, ప శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. రెండు, మూడు బయటి దేశాలు కుడా తెలంగాణా బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలులో తాలు, తరుగుదల లేకుండా కొనుగోలు చే స్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర కే కొనుగోళ్లు జరుగుతున్నాయని, తేమ శాతంలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూ చించారు.

ప్రకృతి విపత్తులతో అవాంతరాలు సంభవించిన పక్షంలో అధిగమించేందుకు అధికారుల ను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖా ము ఖ్య కార్యదర్శి డి.ఎస్ చౌహాన్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అటువంటి సందర్భం లో ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు. సిఎంఆర్ బి య్యం మిల్లింగ్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సన్నాలకు 10 నుంచి 50 రూపాయలు,దొడ్డు రకానికి 10 నుంచి 40 రూపాయలకు పెంచామన్నారు. నిబంధనల మేరకే బ్యాంక్ గ్యారెంటీ పెట్టమని మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News