Wednesday, November 6, 2024

2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం

- Advertisement -
- Advertisement -

ఐఓసికు లేఖ రాసిన భారత ఒలింపిక్ సంఘం

న్యూఢిల్లీ: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తె లిసింది. 2036 లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు ఆ సక్తి తెలియజే స్తూ భారత్ అంతర్జాతీయ ఒలింపిక్ సం ఘాని (ఐఓసి)కి అధికారికంగా లేఖ రాసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఇదే జరిగితే భారత్ ఒలింపిక్స్ నిర్వహణ క ల సాకారం అయ్యే అవకా శాలున్నాయి. ఒలింపి క్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి న రేంద్ర మోడీ స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నా లు చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులు ఉత్సాహంగా ఉన్నారని, దీని కోసం 140 కోట్ల మంది ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని గ తంలో ప్రధాని వెల్లడించారు. ఇదిలావుండగా తాజాగా ఒలింపిక్స్ ని ర్వహణకు భారత్ సిద్ధంగా ఉంద ని తెలియజేస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇప్పటికే ఐఓసికి లే ఖ రాసినట్టు తెలిసింది.

కాగా, 2028 ఒలింపిక్స్‌కు అమెరికా నగ రం లాస్ ఏంజిల్స్, 2032 వి శ్వక్రీడలకు బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో అందరి చూపు 2036 ఒలింపిక్స్ పై పడింది. ఇక 140 కోట్ల జనాభా కలిగిన అతి పె ద్ద దేశం భారత్ కూడా ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం రేసులో నిలిచింది. 2025 అంతర్జాతీయ ఒ లింపిక్స్ కమిటీ (ఐఓసి) ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఐఓసి నాయకత్వ విభాగం ఒ లింపిక్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌ఉం ది. స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఐఓసి భారత్‌వైపే మొగ్గు చూపే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

భారత్‌లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహిస్తే ఐఓసి లాభం చేకూరే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అందుకే ఐఓసి కూడా భారత్‌కే ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భా రత క్రీడా రంగానికి కొత్త జోష్ లభించడం ఖా యం. ఆతిథ్య హక్కులు లభిస్తే ఈ క్రీడల్లో భారత్ అ సాధారణ ఆటతో పతకాలు పంట పండించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. క్రీడల నిర్వహణకు దాదాపు పది సంవత్సరాల సమయం ఉంటే పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడం కష్టమేమీ కాదు. ఇదిలావుంటే ఒలింపిక్స్ నిర్వహణ ఛాన్స్ లభిస్తుందా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే ఉన్నా అభిమానులు మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడలు నిర్వహించే ఛాన్స్ లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News