Sunday, November 24, 2024

కొనసాగుతున్న ట్రంప్ హవా… జార్జియాలో కమల వెనుకంజ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్తి కమలా హరీస్ కంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కమలా హరీస్ 30 సీట్లు వెనుకంజలో ఉన్నారు. అలబామా, అర్కాన్సస్, కెంటకీ, దక్షిణా కరోలినా, ఓక్లహోమా, వెస్ట్ వర్జీనియా, మిస్సోరి, ఫ్లోరిడా, ఇండియానా, టెన్నిసీ వంటి రాష్ట్రాలలో రిపబ్లికన్లు అధిక్యం సంపాదించడంతో ట్రంప్‌కు 101 ఎలక్టోరల్ సీట్లు సాధించారు. మాసాజు సెట్స్, వెర్మాంట్, మెరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆప్ కొలింబియా, మేరీల్యాండ్ రాష్ట్రాలలో డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యంలో ఉండగా కమల 71 సీట్లు గెలుచుకుంది. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో డోనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండడంతో హారిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. 2020లో జార్జియాలో డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియా, పిట్స్ బర్గ్, ఫిలడెల్ఫియాలో కమల ముందంజలో ఉండడంతో ఇద్దరు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News