Thursday, November 21, 2024

ఇంటికి పిలిచి చంపేసి… మృతదేహంతో రైలులో 149 కిలో మీటర్లు ప్రయాణించి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పరిచయం ఉండడంతో ఓ వృద్ధురాలిని ఇంటికి పిలిచారు. ఆమెను తండ్రీ కూతుళ్లు హత్య చేసి మృతదేహంతో రైలులో 149 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నెల్లూరులోని సంతపేట రాజేంద్రనగర్‌లో రమణి(65), మురుగేశం అనే దంపతులు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం అనే కుటుంబం రమణి ఇంటిక దగ్గరలో ఉండేది. బాల సుబ్రహ్మణ్యం అదే ప్రాంతంలోని మరో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. బాల సుబ్రహ్మణ్యం కుటుంబం గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతోంది. సోమవారం రమణి కూరగాయాలు తీసుకోవడానికి బయటకు వెళ్లింది.

సుబ్రహ్మణ్యం కుటుంబానికి రమణి కలవడంతో ఇంటికి తీసుకెళ్లారు. వృద్ధురాలు బంగారు ఆభరణాలు ఉండడంతో ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమెను హత్య చేసి  అనంతరం మృతదేహాన్ని ప్లాసిక్ కవర్‌లో కట్టి సూట్‌కేసులో కుక్కారు. సూట్‌కేసులో సంతపేట నుంచి సౌత్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని చెన్నై వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ నుంచి సూట్ కేసును బయటపడేసేందుకు వీలు కాలేదు. సూట్‌కేసు నుంచి రక్తం కారుతుండడంతో ప్రయాణికులకు అనుమానం రావడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పొంతన లేని సమాచారం ఇస్తుండడంతో సూట్‌కేసును ఓపెన్ చేయగా మృతదేహం కనిపించింది. అప్పటికే వృద్ధురాలు కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు సంతపేట పిఎస్‌లో ఫిర్యాదు చేశారు.

రైల్వే పోలీసుల సమాచారం మేరకు సంతపేట ఎస్‌ఐ బాలకృష్ణ, రమణి కుటుంబ సభ్యులతో కలిసి మీంజూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రమణి మృతదేహం గుర్తించి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన స్థలం నెల్లూరు జిల్లా కావడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. తండ్రీ కూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్య చేశామని ఒప్పుకున్నారు. ఈ హత్యలో బాల సుబ్రహ్మణ్యం భార్య హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News