న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నాడు. ఇప్పట్విరకు ట్రంప్‌కు 230 ఎలక్టోరల్ సీట్లు గెలుచుకొని ముందంజలో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హరీస్ 205 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకొని వెనుకంజలో ఉంది. ట్రంప్ 23 రాష్ట్రాలలో అధిక్యంలో ఉన్నారు. అతి ముఖ్యమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హరీస్ వెనుకంజలో ఉన్నారు. ఐడహో, కాన్సస్, ఫ్లోరిడా, అయోవా, సౌత్ కరోలినా, మెంటావా, యుటా, అలబామా వెస్ట్ వర్జీనియా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, ఓహాయో, మిసిసిపి, మిస్సోరి, నెబ్రస్కా, ఓక్లహోమా, ఇండియానా, కెంటకీ, టెన్సెసీ, టెక్సాస్, ఆర్కాన్సాస్ వంటి రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. మేరీ ల్యాండ్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, కాలిఫోర్నియా, కొలరాడో, రోడ్ ఐల్యాండ్, వాషింగ్టన్, ఇల్లినోయీ, మసాచుసెట్స్, డెలవేర్, న్యూయార్క్, కనెక్టికట్ వంటి రాష్ట్రాలో కమలా హరీస్ ముందంజలో ఉన్నారు. ట్రంప్‌కు 51.4 శాతం ఓట్లు రాగా కమలా హరీస్ కు 47.2 శాతం ఓట్లు వచ్చాయి.
ట్రంప్ కు 230 సీట్లు…. కమలా హరీస్ కు 205 సీట్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -