అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్ దాదాపు విజయం ఖాయమైంది. మ్యాజిక్ ఫిగర్ 270కి గానూ ట్రంప్ 267 సీట్లు వచ్చాయి. ఇప్పటికే నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారంటూ ఆయనకు యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అమెరికన్ ఓటర్లు రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు నిరాశ ఎదురైంది. మరో మూడు ఎలక్టోరల్ ఓట్లు వస్తే.. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుని విజయం సాధిస్తారు.
విజయానికి చేరువ కావడంతో ట్రంప్ మద్దతు దారులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఆయనకు ప్రపంచ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని పోస్ట్ చేశారు. “చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్, అమెరికా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదాం” అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇక, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపారు.