Monday, December 23, 2024

గురువారం రాశి ఫలాలు(07-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.  వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం – వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు.

మిథునం – ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూల పరుచుకోగలుగుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురయి చికాకులు పెడతాయి.

కర్కాటకం – వ్యాపార పరంగా లాభాలు చేతికింది వస్తాయి పనిభారం వలన ఎంత సమయం ఉన్న సరిపోదు. నూతన పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.

సింహం – పెట్టుబడిలో తగిన లాభాలు పొందుతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  కుటుంబంలోని మనస్పర్దాలు తీరి ప్రశాంతతను పొందుతారు.

కన్య – ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.  కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. క్రయక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

తుల – శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మంచి ఫలితాలను సాధిస్తారు.

వృశ్చికం – ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

ధనుస్సు – కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం – మానసిక ప్రశాంతత లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

కుంభం – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి.

మీనం – అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి గోచరిస్తుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News