Wednesday, April 2, 2025

ప్రేమ విఫలం… అత్తాపూర్ లో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా  అత్తాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాయికుమార్ హైదరాబాద్ లో ఎలక్ట్రిషియన్ పని చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. సాయికుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు.  ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో  ప్రేమ విఫలమయిందని తీవ్ర మనస్తాపం చెందాడు.  బుధవారం అర్ధరాత్రి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News