Thursday, November 7, 2024

బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయం పూజారిని సస్పెండ్ చేసిన కెనడా

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: హింసాత్మక చర్యల్లో పాల్గొన్నందుకు,  హింసను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకుగాను కెనడాలోని బ్రాంప్టన్ మందిర పూజారిని కెనడా సస్పెండ్ చేసింది. ఇటీవల ఖలిస్థానీలు తమ జెండాలు పట్టుకుని మందిరం వద్ద హిందువులను చితకబాదిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ సభా మందిరం పూజారిని బుధవారం కెనడా సస్పెండ్ చేసింది. కాగా పూజారి హింసను రెచ్చగొట్టే ప్రసంగం చేశారని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ‘ఎక్స్’ పోస్ట్ పెట్టారు. ఈ విషయాన్ని కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పేర్కొంది. ఇదిలా ఉండగా ఒంటారియోలోని సిక్కులు, గురుద్వారా కౌన్సిల్ ఆదివారం రాత్రి హిందూ సభ మందిరం వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలను ఖండించింది. హింసాత్మక చర్యలను భారత్ ఇప్పటికే ఖండించింది. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తన ఆందోళనను వ్యక్తం చేసింది. భారతీయుల రక్షణపై శ్రద్ధ పెట్టాలని కోరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News