Thursday, November 7, 2024

శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ..

- Advertisement -
- Advertisement -

BCCI నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడనందుకు శ్రేయాస్ అయ్యర్ పై వేటు పడింది. పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ చెలరేగుతున్నాడు. భారత టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రపై సెంచరీ కొట్టిన అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్ లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. అది కూడా 100 స్ట్రైక్ రేట్‌తో.

ఈ మ్యాచ్ లో ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలతో చెలరేగిన శ్రేయస్.. డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. క్రీజులో ఉన్న సమయంలో అయ్యర్ దూకుడు ఏ దశలోనూ తగ్గలేదు. అతను కేవలం 228 బంతుల్లో 24 ఫోర్లు, 9 సిక్సర్లతో 102.19 స్ట్రైక్ రేట్ వద్ద 233 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయ్యర్ చెలరేగడంతో ముంబై స్కోరు 550 పరుగులు దాటింది.

కాగా.. టెస్టు ఫార్మాట్‌లో ప్రస్తుతం టీమిండియా మిడిలార్డర్ లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో అయ్యర్ భారీ ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఇదిలావుంటే.. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3 తేడాతో ఓడి సంగతి తెలిసిందే. ఈ నెల చివరలో భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News