శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నేడు(గురువారం) ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో ఎంఎల్ఏలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎంఎల్ఏ ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ బ్యానర్ ప్రదర్శించగా, ప్రతిపక్ష బిజెపి నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఎంఎల్ఏలు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. దాంతో అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి ఎంఎల్ఏలను విడదీశారు. స్పీకర్ ఎంఎల్ఏ ఖుర్షీద్ కు అనుకూలంగా పక్షపాత వైఖరిని అనుసరిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. మొదట స్పీకర్ కొద్ది సేపు వాయిదా వేశారు.
కేంద్రం తొలగించిన ఆర్టికల్ 370, 32ఎ లను పునరుద్ధరించాలని పిడిపి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. అంతేకాక ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా డిమాండ్ చేసింది. బిజెపి సభ్యులు వీటిని పూర్తిగా వ్యతిరేకించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే వైఖరిని అనుసరిస్తున్నాయని అన్నారు. సభలో గలాభా ఎంతకు తగ్గకపోయేసరికి స్పీకర్ అబ్దుల్ రహీమ్ ప్రతిపక్ష సభ్యులను బయటికి లాగిపారేయమని మార్షల్స్ ను ఆదేశించారు.
Massive ruckus in Jammu and Kashmir Assembly.
BJP Vs NC-PDP over Article 370 resolution. #jk #jammukashmir pic.twitter.com/6OdGt3RcAX— Surabhi Tiwari🇮🇳 (@surabhi_tiwari_) November 7, 2024