Friday, November 22, 2024

హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా..?:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కనీసం రేవంత్‌రెడ్డి పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎంఎల్‌ఎలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన సిఎం పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని విమర్శించారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా..? అని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా కాంగ్రెస్ పార్టీ పాపం పోదు అని పేర్కొన్నారు. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, సిఎం పాదయాత్ర మరొక దగ్గర…హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. హైదరాబాద్ నుండి సిఎం పాద యాత్ర మొదలు పెట్టాలని అన్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు..? అని అడిగారు. 11 నెలల పాలనే కాదు, సిఎం పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన తమ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News