Tuesday, December 3, 2024

వివాహేతర సంబంధం?… అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం నెల్లికుదురు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మునిగిల వీడు గ్రీమంలో దేశబోయిన శ్రీశైలం(42) తన భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అదే గ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధ పెట్టుకున్నాడని అతడితో ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. శ్రీశైలంపై చెప్పులతో దాడి చేయడంతో పాటు అతడిని బండిబూతులు తిట్టారు. శ్రీశైలంను చంపేస్తామని బెదిరించారు. అవమానం తట్టుకోలేకె శ్రీశైలం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీశైలం భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News