Thursday, November 14, 2024

ఏడాది సంబురం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది
కావొస్తున్న సందర్భంగా 26 రోజుల
పాటు సంబురాలు డిసెంబర్ 9
వరకు జరగనున్న వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక ఉత్సవాలు
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు
ప్రతిబింబించేలా కార్యక్రమాలు
గ్రూప్4 అభ్యర్థులకు నియామక పత్రాలు
అందజేత వివిధ శాఖలకు
సంబంధించిన విధానాలను
ప్రకటిస్తాం ఉస్మానియా ఆసుపత్రి,
స్పోర్ట్ వర్సిటీకి శంకుస్థాపన
డిసెంబర్ 9న హైదరాబాద్‌లో వేలాది
మంది కళాకారులతో ప్రదర్శనలు
కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూ ర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉ త్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అ ధ్యక్షతన శనివారం సచివాలయంలో జ రిగింది. ఈ సమావేశంలో మంత్రి పొ న్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాల, ప్రజా కవి జయరాజ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి జయేష్ రంజన్, ముఖ్య కార్యదర్శులు రవి గుప్తా, క్రిస్టినా జోంగ్తు, ఎం శ్రీధర్, కార్యదర్శి దాసరి హరిచందన, లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాది కాలంలో ఎన్నో అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. చేపట్టిన కార్యక్రమాలను, ప్రభు త్వ విజన్‌ను తెలియచేసేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ 26 రోజుల కార్యక్రమాల్లో ప్రభుత్వ గ్యారెంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉ చిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇం దిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై చై తన్య పరుస్తామని తెలిపారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని, దా దాపు రూ. 18 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు 20 వేల కో ట్ల వడ్డీ లేని రుణాలను అందచేశామని గుర్తు చేశారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఉత్సవాలను ప్రారంభిస్తామని చెప్పారు. చివరి రోజైన డిసెంబర్ 9 న హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ మధ్యకాలంలో టీజీపీఎస్సీలో ఎంపికైన గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తామని వివరించారు. పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చకోవడం, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. కొత్తగా రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభిస్తామన్నారు. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News