Thursday, November 14, 2024

బిసి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: బిసిల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కులగణన అంటున్నారని కానీ బిసి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయ్యిందని, బిసి డిక్లరేషన్ పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. బిసి డిక్లరేషన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హనుమకొండలో బిఆర్‌ఎస్ నేతల మీడియా సమావేశంలో కెటిఆర్ ప్రసంగించారు. కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారని, బ్యాంకులో డబ్బెంత ఉంది, ఎసి ఉందా.. ఫ్రిజ్ ఉందా? అని అడుగుతున్నారని, కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, బిసిల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు.

స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఓబిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని కెటిఆర్ మండిపడ్డారు. ఒబిసిలకు మంత్రిత్వ శాఖ ఉండాలని గతంలో కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన మళ్లీ ఎత్తుకున్నారని, తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లపై అధ్యయానానికిని బిఆర్‌ఎస్ బృందాన్ని పంపిందన్నారు. చేతిగుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తుదారుల గొంతు కోశారని, కొత్త పథకాల మాట దేవుడెరుగు ఉన్న పథకాలకే పాతరేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే బిసి బందు, రైతు బంధును బంద చేశారని  కెటిఆర్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News