Saturday, November 23, 2024

డ్రోన్ వార్

- Advertisement -
- Advertisement -

2022లో యుద్ధం ఆరంభమైన తరువాత మాస్కోపై ఇదే అతిపెద్ద దాడి
అన్ని డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా సైన్యం
రష్యా తమపై 145 డ్రోన్లతో దాడి చేసిందన్న ఉక్రెయిన్

కీవ్ : రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొన్ని రోజులుగా రెందు దేశాలు పరస్పరం డ్రోన్ల దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ ఏకంగా 34 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై దాడి చేసింది. అయితే, ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా సైన్యం ప్రకటించింది. మాస్కో దిశగా వస్తున్న 34 డ్రోన్లను కూల్చివేశామని, ఇతర ప్రాంతాల్లో మరి 36 డ్రోన్లను కూల్చివేశామని సైన్యం వెల్లడించింది. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో మాస్కో నగరంలోని మూడు విమానాశ్రయాలకు వచ్చే విమానాలను దారి మళ్లించారు. 2022లో యుద్ధం మొదలైన తరువాత రష్యా రాజధానిపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్పందిస్తూ, రష్యా ఇటీవల తమ దేశంపై 145 డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు.

మాస్కోపైన, శివార్లపైన ఉక్రెయిన్ డ్రోన్ల దాడుల్లో ఒక మహిళ గాయపడినట్లు అధికారులు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దురాక్రమణ దరిమిలా రష్యన్ దళాలు అక్టోబర్‌లో భారీగా నష్టపోయినట్లు యుకె రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు బిబిసితో చెప్పారు. మాస్కో సైనికులు సగటున 1500 మందిని కోల్పోవడమో, ‘ప్రతి ఒక్క రోజున’ గాయపడడమో జరిగిందని, యుద్ధంలో వారి మొత్తం నష్టాలు ఏడు లక్షలకు పెరిగిందని యుకె రక్షణ దళాల చీఫ్ టోనీ రదకిన్ బిబిసికి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News