Thursday, November 14, 2024

వయనాడ్ నియోజకవర్గంలో ప్రియాంక తుది ప్రచారం

- Advertisement -
- Advertisement -

వయనాడ్ (కేరళ): కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యుడిఎఫ్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గంలో తన తుది ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట ప్రఖ్యాత తిరునెల్లి మహావిష్ణు ఆలయాన్ని సందర్శించారు. పాపనాశని నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ప్రియాంక గాంధీ తండ్రి దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ చితాభస్మాన్ని1991లో ఈ నదిలోనే నిమజ్జనం చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్థి చెందిన ఈ ప్రాచీన ఆలయ చరిత్రను ప్రియాంక ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అక్కడ నుంచి మనంధవాడి లోని ఎడవాకకు ప్రియాంక బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ నేతృత్వ యుడిఎఫ్ కార్యకర్తలు ప్రియాంకకు ఘన స్వాగతం పలికారు. వారితో ప్రియాంక మమేకమై కొంతసేపు చర్చలు జరిపారు. ఎడవాకతోపాటు ఆరు సమావేశాల్లో ఆమె ఆదివారం పాల్గొనవలసి ఉంది. చుల్లియోడె, వడువంచల్‌లో కార్యకర్తల స్వాగతం తరువాత నైకట్టి, సుల్తాన్ బాథెరీ ప్రాంతాల్లో ప్రచార సమావేశాలు నిర్వహించిన తరువాత ప్రచారం ముగుస్తుంది. సోమవారం ప్రియాంక, రాహుల్ గాంధీ కలిసి సుల్తాన్ బాథెరీ, తిరువంబాడి రోడ్‌షోలు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News