Thursday, November 14, 2024

అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు

- Advertisement -
- Advertisement -

కోపముంటే నాపై కక్ష తీర్చుకోండి..
ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి
చేయకపోతే చరిత్ర నన్ను క్షమించదు
జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కృష్ణా
జలాలను పారిస్తాం అమరరాజా
కంపెనీలో 2వేల మంది స్థానికులకు
ఉద్యోగావకాశాలు గ్రామాలు,
తండాలకు బిటి రోడ్లు అమ్మాపూర్
బహిరంగసభలో సిఎం రేవంత్‌రెడ్డి
వ్యాఖ్యలు రూ.110కోట్లతో
కురుమూర్తి ఆలయ అభివృద్ధి
పనులకు శంకుస్థాపన

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో/చిన్నచింతకుంట : ‘మా ప్రయత్నాలను అడ్డుకోవాలని కొందరు చిల్లర రాజకీయాలకు పాల్పడు తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్రహీనులవుతారు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించా రు. ఆదివారం నాడు చిన్నచింతకుంట మండలం, అమ్మాపూర్‌లోని కురుమూర్తి దేవాలయంలో స్వామివారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి సి ఎం రేవంత్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అ నంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ.110 కోట్లతో ఘాట్ రో డ్, ఎలివేటెడ్ కారిడార్ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధ్దికి అంచనాలు రూపొందించాలని అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అమ్మాపూర్‌లో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి సిఎం ప్రసంగిస్తూ.. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు ప్రా జెక్టులు పూర్తిచేయకపోతే తనను చరిత్ర క్షమించదని అన్నారు.. తనపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించండి తప్ప.. ప్రా జెక్టులను అడ్డుకోవద్దని హితవు పలికారు. కాళ్లల్లో కట్టెలు పెట్టి కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరని ఘాటుగా హెచ్చరించారు.

పాలమూరు జిల్లాకు వలస వచ్చిన కెసిఆర్ ఇక్కడ ఎంపిగా గెలిచినా, ముఖ్యమంత్రిగా చేసినా ఈ జిల్లాకు నిధుల విషయంలో వివక్ష చూపారని, కెసిఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వారి ప్రాంత అభివృద్ధికి మాత్రమే నిధులు మళ్లించి అభివృద్ధి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. 60 సంవత్సరాల తర్వాత పాలమూరు జిల్లా బిడ్డకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, ఆరు నూరైనా పాలమూరు జిల్లాకు నిధులు వరద పారించి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధ్ది చెందిందని కొనియాడారు. తెలంగాణ నుంచే కాకుండా కర్నాటక, ఆంధ్రపదేశ్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. ఇలాంటి చారిత్మ్రాక దేవాలయాన్ని అన్ని విధాల ఆభివృద్ధ్ది చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రపదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా పాలమూరు జిల్లా అనేక రంగాల్లో వివక్ష, నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు, కరువుకు నిలయమైన పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్షమేనని ఆరోపించారు. తెలంగాణ వచ్చి పదేళ్లు దాటినా వలసలు కొనసాగుతున్న సందర్భంలో జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేటట్లు నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలో మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని సిఎం ప్రకటించారు. జిల్లాలో అమరరాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. ఈ ప్రాంతానికి ఏ కంపెనీ వచ్చినా స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బిటి రోడ్డు వేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధ్ది పథంలో నడిపిస్తామన్నారు. ఈ సభలో మహబూబ్‌నగర్, దేవరకద్ర ఎంఎల్‌ఎలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జి .మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కురుమూర్తి రాయను దర్శించుకున్న మొదటి సిఎం ః
సిసికుంట మండలం, కురుమూర్తి రాయస్వామిని దర్శించుకున్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలవనున్నారు. కురుమూర్తి స్వామి దేవాలయం ఏర్పాటైనప్పటి నుంచి భక్తులు లక్షల్లో వస్తున్నా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో సిఎం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News