Monday, December 23, 2024

సోమవారం రాశి ఫలాలు(11-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన విధి విధానాలను అలవర్చుకుంటారు. చేపట్టిన పనులలో స్వయంకృతాపరాధలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతుంది.

వృషభం – అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. సెకండ్ ఇన్కమ్ కోసం ఆలోచనలు సాగిస్తారు. నూతనమైన వ్యాపారాలు ప్రారంభించాలని యోచిస్తారు.

మిథునం – వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనం మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

కర్కాటకం – దైనందిన జీవితంలో నూతనమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఊహించిన పరిణామాలు తలకిందులు అవుతాయి.

సింహం – పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసిక ఆనందం కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో సహచర్లతో ఏర్పడినటువంటి మనస్పర్ధలు సమసిపోయి అనుకూల వాతావరణం ఏర్పరచుకుంటారు.

కన్య – దైవదర్శనానికి పుణ్యక్షేత్రాల సందర్శనకి తేదీలను ఖరారు చేసుకుంటారు. కార్యాలయంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా మీ ప్రణాళిక ఏర్పరచుకుంటారు.

తుల – ఉద్యోగ భద్రత కొంత ఒత్తిడికి గురిచేస్తుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. పిల్లల ఆరోగ్య విషయం విద్యా విషయమై ప్రత్యేకమైన శ్రద్ధని చూపించవలసి ఉంటుంది.

వృశ్చికం – తల్లిదండ్రుల ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త వహించాలి. వివాహది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు ప్రయాణాలు లాబిస్తాయి.

ధనుస్సు – సంతానం మొదలైన కుటుంబ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. అనుకూలమైన ఉత్తర్వుల వలన లాభపడగలుగుతారు.శుభవార్తలు వింటారు.

మకరం – వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు.

కుంభం – జరగవు అనుకున్న కార్యక్రమాలు ఆకస్మికంగా ముడి పడతాయి. పెళ్లి ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెట్టగలుగుతారు.

మీనం – వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలని భావిస్తారు. విదేశీ  విషయాలు, విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన విషయాలలో మెలకువలు వహించండి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News