Monday, December 23, 2024

సీనియర్ వేధించడంతోనే స్వాతిప్రియ ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే తన సోదరి చనిపోయిందని మృతురాలి సోదరుడు భజరంగ్ ఆరోపణలు చేశారు. ట్రిపుల్ ఐటి విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై ఆమె సోదరుడు భజరంగ్ స్పందించారు. తన సోదరిని సీనియర్ విద్యార్థి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. ఓ సీనియర్ విద్యార్థి రోజు ఫోన్ చేసి వేధింపులకు గురిచేసే వాడని, ఇంఛార్జ్  ప్రిన్సిపల్, వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. బాసర ట్రిపుల్ ఐటిలో ట్రిపుల్ పియుసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నిజామాబాద్ జిలా ఆర్మూర్ మండల కేంద్రంలోని తిరుమల కాలనీకి చెందిన ఆమె అని అధికారులు వెల్లడించారు. SHKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News