Thursday, November 14, 2024

ఓ కేసులో విచారణ… పంజాగుట్టలో భారీ దొంగతనం వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్యాటరీల చోరీ కేసులో విచారిస్తే భారీ చోరీ వెలుగులోకి వచ్చిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బ్యాటరీలత దొంగతనం కేసులో విచారణ చేస్తుండగా వైద్యుడి ఇంట్లో భారీ ఎత్తున ఆభరణాలు చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ లోని ఎంఎల్ఎ కాలనీలో వైద్యుడి ఇంటిలో 48 తులాల బంగారు ఆభరణాలను దంపతులు చోరీ చేశారు. పంజాగుట్ట లోని యజమాని క్లినిక్ లో పనిమనిషి దిలీప్ గుప్తా బ్యాటరీలు చోరీ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించారు.

గతంలో ఏమైనా చోరీలు చేశారా అని ఆరా తీశారు. దీంతో యజమాని ఇంట్లో భర్తతో కలిసి ఆభరణాలు కాజేసినట్లు దిలీప్ గుప్తా వెల్లడించారు. దీంతో యజమానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. తమ ఇంట్లో బంగారం పోయిన విషయాన్ని వైద్యుడు గుర్తించాడు. మొత్తం 48 తులాల ఆభరణాలు పోయినట్లు తేలడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News