Thursday, November 14, 2024

కారు, కమలం.. చీకటి బంధం

- Advertisement -
- Advertisement -

విచారణను తప్పించుకోవడానికి కెటిఆర్ పాట్లు 
హస్తినలో పైరవీలు చేస్తున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మోడీ గురించి ఒక్క మాట మాట్లాడని కెసిఆర్
బిసిలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు..అందుకే కులగణన 
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు 90శాతం బిఆర్‌ఎస్ కార్యకర్తలకే
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఖతం చేసేందుకు మోడీ యత్నం
పెట్టుబడులు రాకుండా పిఎంఓ కుయుక్తులు 
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ముఖ్యమంత్రి రేవంత్ ఆ రోపించారు. ఇందుకు తాజాగా జరిగిన ఉదంతమే నిదర్శమని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అవినీతిపై చ ర్యలకు అనుమతి కోరుతూ 15 రోజుల క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన నుంచి ఇప్పటివరకు స్పందన లేదని, సిఎం ఆరోపించారు. తనపై చర్యలకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్‌పై ఒత్తిడి కో సం కెటిఆర్ ఢిల్లీలో పైరవీ చేస్తున్నారని సిఎం ఆరోపించారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్న బంధానికి ఇది నిదర్శనం కాదా అని ఆయన ప్ర శ్నించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమం లో పాల్గొన్న రేవంత్ పలు కీలకాశాంకాలపై ఆస క్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీకి కెసిఆర్ వ్యతిరేకం అయితే మరీ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడారని సిఎం ప్రశ్నించారు. ఎన్సీపి నాయకుడు శరద్‌పవార్ గ తంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు కెసిఆర్‌కు మద్ద తు ఇచ్చారని, ఆ విశ్వాసంతోనైనా శరద్‌పవార్ పా ర్టీ కోసమైనా కెసిఆర్ ఎందుకు ఒక ప్రకటన చే య డంలేదని ఆయన ప్రశ్నించారు. కులగణన అం శా న్ని కేవలం బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు మాత్ర మే వివాదం చేస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఒక మొబైల్ ఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఆ సంస్థ అడిగే వివరాలను అందిస్తున్నప్పుడు ప్రభు త్వం కోరుతున్న వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. సమాజంలో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితి గతులను తెలుసుకోవడం ద్వారా వారికి మరిన్ని సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి దోహదపడతాయని ముఖ్యమంత్రి అన్నారు. వాటిని అందించడానికే తమ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక వివరాల కోసం సర్వే నిర్వహిస్తుందని ఆయన అన్నా రు. బిసిలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్‌లు అమలు చేయాలంటే మరీ వారి వివరాలు ప్రభుత్వానికి తెలియాలా లేదా అని ఆయన ప్రశ్నించారు.

డబుల్ ఇళ్లు 90 శాతం బిఆర్‌ఎస్ కార్యకర్తలకే…
బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సంక్షేమ ఫలాలు కేవలం వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందాయని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 90 శాతం బిఆర్‌ఎస్ కార్యకర్తలే పొందారని సిఎం ఆరోపించారు. మూడు అంతస్థుల భవనం కలిగిన వ్యక్తి కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు పొందారని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా నిజమైన లబ్ధిదారుడిని గుర్తించడానికి తమ సర్వే దోహదపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ మోడల్‌లోనే సమాన అవకాశాలు
ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడమే తెలంగాణ మోడల్ అని రేవంత్ అన్నారు. సంక్షేమం చేపడితే అభివృద్ధి ఉండదని, అభివృద్ధిపై దృష్టి పెడితే సంక్షేమ ఉండదని ఆయన అన్నారు. ఈ రెండింటిని సమతుల్యం చేయాలని, అదే సుపరిపాలన అని, దానిని దృష్టిలో పెట్టుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ 2023, సెప్టెంబరు 17న ఆరు గ్యారంటీలు ఇచ్చారని, దానికి అదనంగా తాను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మరో గ్యారంటీ చేర్చానన్నారు.

పదేళ్లలో కెసిఆర్ పదిసార్లు సచివాలయానికి
పదేళ్ల కెసిఆర్ హయాంలో పదిసార్లు సచివాలయానికి రాలేదని, తాను పది నెలల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళుతున్నానని ఆయన తెలిపారు. పదేళ్లలో ఎవరైనా ఇబ్బందులు ఉండి ధర్నా చేయాలనుకుంటే అలా చేయడానికి వీలు లేకుండా ధర్నా చౌక్‌ను మూసివేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. తాను ధర్నా చౌక్ ఓపెన్ చేశానని ఇప్పుడు హరీశ్ రావు, కెటిఆర్‌లు ఆ ధర్నా చౌక్‌కు వస్తున్నారన్నారు.
ప్రతిపక్ష రాష్ట్రాలను ఖతం చేసేందుకు యత్నం
2004 నుంచి 2014 వరకు యూపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారని ఆయన గుజరాత్ మోడల్ కు ప్రచారం చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఎటువంటి ఆటంకం కలిగించలేదని ఆయన తెలిపారు. ఆయనకు అవసరమైన అనుమతులు, బడ్జెట్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఖతం చేసేందుకు ఆయన స్థాయిలో ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

పెట్టుబడులు రాకుండా పిఎంఒ కుట్ర
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే గుజరాత్ వెళ్లమని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి 17 భారీ పెట్టుబడులు గుజరాత్‌కు తరలించారని ఆయన అన్నారు. ఈ విధానం సరైంది కాదన్నారు. ప్రధానమంత్రి జడ్జిలా ఉండాలి, ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోకూడదని ఆయన తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు మోడీ ఇద్దతు ఇస్తే ప్రతి రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తయారు చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రూ.16 లక్షల కోట్ల రుణాలను కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసింది కానీ, మేము పేదలకు సబ్సిడీపై రూ.500లకు సిలిండర్ ఇస్తామంటే బిజెపి వ్యతిరేకిస్తుందని సిఎం ఆరోపించారు.

మరో 9 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు, మరో పదేళ్లు వైఎస్ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరువాత రాష్ట్ర ఏర్పడిన తరువాత కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నట్టే, తమ ప్రభుత్వం కూడా 10 ఏళ్లు అధికారంలో ఉండబోతుందని ఆయన అన్నారు. ఇప్పటికీ 11 నెలలు పూర్తయ్యింది, ఇంకా 9 ఏళ్ల ఒక నెల పాటు తెలంగాణలో అధికారంలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సిఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని, ఆ తరువాత రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వం కూడా అదే పరంపరను కొనసాగించిందని ఆయన అన్నారు. రాజకీయంగా కెసిఆర్‌తో విభేదించినప్పటి కూడా వారు చేసిన అభివృద్ధిని విస్మరించలేనని ఆయన పేర్కొన్నారు.

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం
డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరగబోతుందని సిఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే ఉత్తరాదిలో పార్లమెంట్ సీట్లు గణనీయంగా పెరగడమే కాకుండా దక్షిణాదిలో ఉన్న సీట్లు కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు దక్షిణాదితో సంబంధం లేకుండానే ఉత్తరాది ఎంపి సీట్లతో ప్రధానమంత్రి ఎంపికయ్యే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. జనాభా ప్రాతిపదికన సీట్లు, నిధులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాదికి ఇప్పటికే తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణాది రా్రష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించడాన్ని ప్రశంసించాల్సింది పోయి శిక్షించడమేమిటని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కేంద్రం ఆదేశాలను పాటిస్తూ శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో తాము ఎందుకు మౌనంగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరిగే అన్యాయంపై జాతీయ పార్టీగా కాంగ్రెస్ తన వైఖరిని వ్యక్తం చేయనున్నది ఆయన తెలిపారు. అసలు డీలిమిటేషన్ దాని పర్యావరణాలపై చర్చను మొదలుపెడితే ప్రజాభిప్రాయం వ్యక్తం అవుతుందన్నారు.

టిఆర్‌ఎస్ కార్యకర్తను కాను, ఫైనాన్షియర్‌ను
నేను టిఆర్‌ఎస్ కార్యకర్తను కాను, ఫైనాన్షియర్‌నని సిఎం రేవంత్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఉద్యమానికి మద్దతు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆ సందర్భంగా తాను టిఆర్‌ఎస్‌కు ఫైనాన్స్ చేశానని ఆయన పేర్కొన్నారు. తాను బిఆర్‌ఎస్‌లో పని చేయలేదని, చంద్రబాబు నాయుడుతో చాలాకాలం కలిసి పని చేశానని ఆయన తెలిపారు. బాబు అనుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ సర్కారే…
కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు చూస్తామని అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు అనుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడుతుందని ఆయన చలోక్తి విసిరారు. ఈ దఫా 400 సీట్లు అన్న వారు. 240 సీట్లు సాధించారు. కాంగ్రెస్ 40 నుంచి వందకు చేరింది. నెంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బిజెపి ఓటమి కాదు. ఇది మోడీ ఓటమి. ప్రతి దానికి మోడీ ముద్ర వేశారు. మోడీ గ్యారంటీ అన్నారు. మోడీ గ్యారంటీకి సంబంధించిన వారంటీ పూర్తయిందని తాను ఎన్నికలకు ముందే చెప్పా. ఇప్పుడు నాయుడు, నితీశ్ కొందరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇది మోడీ ఓటమేనని రేవంత్ అభివర్ణించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు. పదేళ్లలో మోడీ ఈ దేశ ప్రజలను ఎలా మోసం చేశారో చెప్పగలిగాం. అన్నదాతలకు వ్యతిరేకంగా పనిచేశారు. రాజ్యాంగం రద్దుకు మోడీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది మేం చెప్పగలిగాం. బిజెపి రహస్య జెండాను బయటపెట్టాం. బిజెపి రహస్య అజెండా వేరు.

వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా మారాలి
వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కూడా మారాల్సి ఉందని సిఎం రేవంత్ సూచించారు. శత్రువును ఓడించాలంటే వారి తరహాలోనే ఆట ఆడాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకులు టెస్ట్ మ్యా చ్ ఆడుతున్నారు. ఇప్పుడు 20-20 ఫార్మాట్ నడుస్తోంది. మేం కూడా ఫార్మాట్ ఆడాలి. లేదా ఫార్మాట్ మార్చుకోవాలి. అప్పుడు బిజెపిని ఉంచడమో ఖతం చేయడమో అన్నది తేలుతుందన్నారు. కాంగ్రెస్ మానవీయ స్పర్శ ఉన్న పార్టీ అని ఆయన కొనియాడారు. బిజెపి అలా కాదు, ఆ పార్టీ ఎంతసేపు అవసరాలు, వ్యాపార కోణంలో రాజకీయాలు చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై…
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల గురించి సిఎం రేవంత్ మాట్లాడుతూ ప్రతి నేత కుర్చీ గురించి ఆలోచిస్తారు. కుర్చీ కోసం విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదు. ఎన్నికలు, గెలుపు, ఓటముల ప్రాధాన్యం కాదు. విభజన రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఎన్నికల గురించే మోడీ ఆలోచిస్తారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష ఉండదు. ఎంత మంచి ఔషధానికైనా ఎక్స్‌ఫరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు విభజన కార్యక్రమాలకు గడువు ముగిసింది.
కాంగ్రెస్‌కు, యువతరానికి మధ్య జనరేషన్ గ్యాప్
కాంగ్రెస్ పార్టీకి, యువతరానికి మధ్య జనరేషన్ గ్యాప్ వచ్చిన మాట వాస్తవమని ఆయన తెలిపారు. సమాజంలో వచ్చిన మార్పు ఇందుకు కారణమన్నారు. గతంలో అమ్మమ్మ,నానమ్మలు వంట చేసేంత వరకు రెండు, మూడు గంటలు వెయిట్ చేసేవాళ్లం, కానీ, ప్రస్తుతం స్విగ్గీలో అర్డర్ ఇస్తే రెండు నిమిషాల్లో ఆర్డర్ వస్తోందన్నారు. ఇప్పుడు యువత మనస్థతత్వం కూడా అలాగే మారిందన్నారు. ఇప్పడు రాజకీయాల్లోనూ స్విగ్గీ రాజకీయాలు ఎక్కువయ్యాయి. సరళీకరణ (లిబరలైజేషన్) తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు, అనుసంధానత తగ్గిపోయింది. సరళీకరణ తర్వాత తమకు ఎంత త్వరగా ఉద్యోగం వస్తుంది. ఎంత త్వరగా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్ రైటింగ్ చేసేవాళ్లం. జెండాలు కట్టేవాళ్లం, ప్రదర్శనలకు (ర్యాలీ)గా వెళ్లేవాళ్లం. మా జేబులోని డబ్బులు ఖర్చుపెట్టుకొని పని చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా, మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేను ఎక్కువగా చెప్పకూడదు. మీరే అర్ధం చేసుకోండి, ఎందుకు అదంతా మారింది. దానికి బాధ్యత బిజెపి ఆ పార్టీ చేసిన తప్పిదాల వల్లేనని ఆయన తెలిపారు.

పవర్ పాలిటిక్స్‌కు గాంధీ కుటుంబం దూరం
పవర్ పాలిటిక్స్‌కు గాంధీ కుటుంబం దూరంగా ఉంటుంది. అల్లర్ల సమయంలో విద్వేష వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. దానిపై బిజెపి నాయకులు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ యూనివర్సిటీ రోజులు ముగిశాయి. మాట్లాడితే కుటుంబ రాజకీయాలు అంటున్నారు. రాహుల్ గాంధీ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరైనా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అయ్యారా..? మీరే చెప్పండి. ఆ కుటుంబం అంత త్యాగాలు ఎవరు చేశారో చెప్పండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రధానమంత్రి పదవి స్వీకరించే అవకాశం వచ్చినా వదులుకున్నారు. మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలకు ఉన్నత స్థానాల్లో అవకాశం ఇచ్చారు. పి.వి.నరసింహారావును ప్రధానమంత్రిని పని చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశాక ఆయన తుగ్లక్ రోడ్డు నుంచి ఇల్లు ఖాళీ చేయిస్తే ఉండడానికి ఆయనకు ఇల్లు లేదు.

ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదు
దేశంలో మూలమూలన ఉన్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి.. కానీ, అదే ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదన్నారు. ఆ రాష్ట్రం ఏటిఎం, ఈ రాష్ట్ర ఏటిఎం అని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీ అంటున్నారు. ఎవరో కార్యకర్త, చిన్నాచితకా నేత అంటే వదిలేయవచ్చు. గాంధీ కుటుంబానికి తెలంగాణ ఏటిఎం మోడీ అంటున్నారు. అది సరైంది కాదు. గాంధీ కుటుంబానికి పైసలు అవసరమైతే ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమిటి..? సొంత ఇల్లు, సొంత వాహనాలే లేనప్పుడు వాళ్లకు పైసలు ఎందుకు..? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News