Thursday, November 14, 2024

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ దూరం?

- Advertisement -
- Advertisement -

కరాచీ: వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండాలని పాకిస్థాన్ జట్టు భావిస్తున్నట్టు తెలిసిందే. పాకిస్థాన్ గడ్డపై వచ్చే సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ మూడు వేదికలను సిద్ధం చేసింది. కానీ భారత్ మాత్రం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు నిరాకరించింది.

హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని బిసిసిఐ కోరుతుంది. భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లను యుఎఇలో జరపాలని బిసిసిఐ ఇప్పటికే పిసిబి, ఐసిసికి లేఖను రాసింది. కానీ దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించలేదు. కాగా, భారత్ టోర్నీ నుంచి వైదొలిగితే పాకిస్థాన్ గడ్డపై ఈ మెగా టోర్నీ జరగడం కష్టంగా మారుతోంది. దీంతో ఐసిసి టోర్నీని సౌతాఫ్రికాకు తరలించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే టోర్నీకి దూరంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News