Friday, November 22, 2024

ఈ ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తుంది: తమ్మినేని

- Advertisement -
హైదరాబాద్: వికారాబాద్ కలెక్టర్ మీద దాడి ఘటన రైతుల ఆగ్రహానికి సూచిక సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోని లగచర్ల గ్రామంలో జరిగిన ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తుందన్నారు. రైతులు తమ భూములను కోల్పోవడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలని చురకలంటించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ నిరసనలతో ప్రారంభమై ప్రతిఘటనకు దారితీసిందన్నారు. రైతులపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ఫార్మాసిటీపై ఎన్నికల ముందు ఇచ్చిన మాట మార్చడంతో అక్కడ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News