Friday, November 15, 2024

వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపో

- Advertisement -
- Advertisement -

వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపోను జీవో 18 ద్వారా మంజూరు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. ఈ యార్న్ డిపోకి రూ.50 కోట్ల నిధులు కూడా మంజూరు చేశామని తెలిపారు. జౌళిశాఖపై బుధవారం నాడిక్కడ మంత్రి తుమ్మల సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వశాఖలు, కార్పోరేషన్ల నుండి వారికి అవసరమైన వస్త్రాల కోసం వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవాలని టెస్కో ఎండి శైలజా రామయ్యర్‌కి ఆదేశాలు జారీ చేశారు.

టెస్కో నుండి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరాను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, సంఘాల నుండి కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News