Saturday, November 23, 2024

ట్రంప్ కీలక నిర్ణయం.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బర్డ్

- Advertisement -
- Advertisement -

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై డెమొక్రాటిక్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాదించాడు. దీంతో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జనవరిలో అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ తదుపరి డైరెక్టర్‌గా మాజీ డెమొక్రాటిక్ ప్రతినిధి తులసీ గబ్బార్డ్‌ను నియమించారు. అధ్యక్షుడి అత్యున్నత గూఢచార సలహాదారుగా పనిచేసే శక్తివంతమైన పదవిని ఆమెకు అప్పగించారు.

కాగా, 2022లో డెమొక్రాటిక్ పార్టీని విడిచిపెట్టి తులసీ.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్‌ను ఆమోదించి అతని మద్దతుదారులలో ప్రజాదరణ పొందింది. 43ఏళ్ల ఆమె అమెరికన్ సమోవాలో జన్మించారు. హవాయిలో పెరిగిన తులసీ బాల్యంలో ఒక సంవత్సరం ఫిలిప్పీన్స్‌లో గడిపారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్‌ను తులసీ గబ్బార్డ్ వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి, మైక్ గబ్బార్డ్, ఒక రాష్ట్ర సెనేటర్.. అతను మొదట రిపబ్లికన్‌గా ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత డెమొక్రాట్‌గా మారారు. కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి హిందువు, తొలి అమెరికన్ సమోవాన్ కూడా ఆమెనే. హౌస్‌లోని మొదటి హిందూ సభ్యురాలుగా గబ్బర్డ్.. భగవద్గీతపై ప్రమాణం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News