మన తెలంగాణ/చర్లపల్లి: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రజపాలనపై ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుంచే ప్రారంభమైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దా డి కేసులో అరెస్టు అయి చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గురువారం ఉదయం ఎమ్మెల్యేలు బండారి లకా్ష్మరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలసి ములాఖాత్‌లో కలిశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పట్నం నరేందర్‌రెడ్డికి ఈ కుట్రకేసుతో ఎలాంటి సంబం ధం లేదని అన్నారు. మా భూములు మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి కనీసం పిలిచి మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు, రైతులు, పోలీసులు ఇలా ఎక్కడ నిరసనలు జరిగిన బిఆర్‌ఎస్ చేయిస్తుందని మాట్లాడుతున్నారని, ప్రతిపక్షంగా ప్రజలకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. ఓటు వేసి గెలిపిస్తే బాగుపడుతామని ఆశించిన లగచర్ల రైతుల నోట్లో మట్టి కొట్టారని అ న్యాయంగా గిరిజన రైతులను జైల్లో పెట్టారని అన్నారు.
మాకు కేసులు జైళ్లు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో మార్లు జైలుకు వెళ్లామని అన్నారు. ప్రభుత్వం కొడంగల్, జహీరాబాద్‌లలో ఫార్మసీటి భూముల సే కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని గత ప్రభుత్వం సేకరించిన 14 వేల ఏకరాల్లో ఫార్మా సిటీ పెట్టాలని అన్నారు. జైల్లో నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని బిఆర్‌ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏమి రాశారో తనకు చూపించకుండనే తప్పుడు రిపోర్ట్‌పై సంతకం పెట్టించారని నరేందర్‌రెడ్డి తెలిపారన్నారు. అన్యాయంగా కుట్ర కేసు పెట్టిన నరేందర్‌రెడ్డితో పాటు గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం, న్యాయస్ధానాలపై నమ్మకం ఉందని నరేందర్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్సీ ఫారుఖ్ హుస్సేన్, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు.