హైదరాబాద్: నటుడు ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ఆర్జించింది. ఇప్పుడు ఆ సినిమా వాటాల పంపకంలో అమెరికా-యూరొప్ పంపిణీదారులతో నిర్మాతలకు చిక్కొచ్చి పడింది. వారికి విజయశాంతి మూవీస్ పంపిన ఈ-మెయిల్ ‘ఎక్స్’ లో లీక్ అయింది. వాస్తవానికి ఈ సినిమా అమెరికా-యూరొప్ లో 1.3 మిలియన్ డాలర్లు సంపాదించింది. కానీ ప్రొడక్షన్ హౌస్ వారికి చెల్లించింది రూ. 5 కోట్ల అడ్వాన్స్ మాత్రమే. చాలా అవకతవకలు జరిగాయాని ప్రొడక్షన్ హౌస్ తెలిపింది. అందుకు వారు పేర్కొంటున్న కారణం యూరొప్ లో నష్టాలు వచ్చయని. అమెరికాకు, యూరొప్ కు ఉన్న పంపిణీదారులు ఒక్కరే.
నిర్మాతలు పంపిణీదారుల నుంచి స్పందన అందాకే చట్టపర చర్యలకు పూనుకుంటారని తెలుస్తోంది.
అందిన సమాచారం ప్రకారం విజయశాంతి మూవీస్ ఇచ్చిన తుది హెచ్చరిక తర్వాత రెండు రోజుల్లో సెటిల్ మెంట్ చేయకపోతే ఛాంబర్ ద్వారా చట్టపర చర్యలు మొదలెడతామంటోంది.