కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ నెల 20 నుంచి ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్ లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించగా కమిషన్ గడువును ఈ నెల 13న పొడిగిస్తూ ప్రభుత్వం మెమోరాండం విడుదల చేసింది. జీవో కోసం 13 రోజులుగా ఎదురు చూస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నీటి పారుదల శాఖ ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈల క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పటికే పూర్తయింది. ఐఏఎస్/మాజీ ఐఏఎస్ లను విచారించిన అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు మాజీ కీలక ప్రజా ప్రతినిధులను విచారణకు హాజరు కావాలని సమన్లు పంపనున్నారు.
వారి విచారణకు అవసరమైన ఆధారాలను కమిషన్ ఇప్పటికే సేకరించింది. ఈ నెలాఖరులో కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ వారిద్దరికీ సమన్లు పంపే అవకాశాలున్నాయి. కమిషన్ నివేదికను డిసెంబర్లో ఖరారు చేసి నెలాఖరు లోగా ప్రభుత్వానికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు పీసీ ఘోష్ కమిషన్ సమన్లు పంపించనుందా? అనంతరం వీరిని విచారించనుందా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం అంశాలపై ఘోష్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 12 నుంచే విచారణ ప్రారంభం కావాల్సి ఉన్నా కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి జీవో రాలేదు. ఇటీవల కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డిసెంబర్ ఆఖరు వరకు కాళేశ్వరంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే ప్రభుత్వం జీవో జారీ చేయడంలో జాప్యం కారణంగా విచారణ రెండు వారాల పాటు ఆలస్యమైంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలు, ఎస్ఈలు, చీఫ్ ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ను ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మాజీ ప్రజాప్రతినిధులకు సమన్లు పంపాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక పాత్ర పోషించిన ఇద్దరు మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు రావాలని సమన్లు పంపనుందని తెలుస్తోంది. అనంతరం వీరిని విచారించనుంది. వీరిని విచారించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలను కమిషన్ ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో వీరిద్దరికి సమన్లు పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి విచారణ తర్వాత డిసెంబర్ నెలాఖరులో ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్ రావు కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ లో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అనేక సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లి నిర్మాణాలను పరిశీలించారు. సెకండ్ టర్మ్‌లో ఆ శాఖను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. కేసీఆర్, హరీశ్ రావు ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని ఇప్పటికే అధికారులు విచారణలో స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన విషయాలు, కమిషన్ సేకరించిన వివరాల ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావును కమిషన్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.