- Advertisement -
ఢిల్లీ నగరం జిఆర్‌ఎపి మూడవ దశ ఆంక్షలతో శుక్రవారం మేల్కొన్నది. వరుసగా మూడవ రోజు నగరంలో వాయు నాణ్యత ‘తీవ్ర’ కేటగరీలో కొనసాగింది. దీనితో కాలుష్యం స్థాయిల తగ్గింపునకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం ఉదయం గాలి నాణ్యత సూచి (ఎక్యు) ‘తీవ్ర’ కేటగరీలో (400, 500 మధ్య) నమోదైందని, 411గా నాణ్యత ఉందని సమీర్ ఆప్ తెలియజేశారు. దేశంలోని అధ్వాన కాలుష్య స్థాయిలను దేశ రాజధాని నమోదు చేయగా, సిఎక్యుఎం జిఆర్‌ఎపి మూడవ దశ ఆంక్షలను విధించింది. నగరంలో గాలి నాణ్యత వరుసగా రెండు రోజుల పాటు ‘తీవ్రమైనది’గా కొనసాగడంతో ఆంక్షలు విధించడమైంది. ‘తీవ్రమైన’ కేటగరీలోకి ప్రవేశించే ముందు ఢిల్లీ గాలి నాణ్యత వరుసగా 14 రోజుల పాటు ‘అత్యంత పేలవం’ శ్రేణిలో ఉన్నది.
- Advertisement -