హైదరాబాద్: సికింద్రాబాద్ చర్చి చాలా పురాతనమైనది. దానిని 1927 లో నిర్మించారు. అక్కడ క్రైస్తవులు ప్రార్థనలు చేసుకుంటుంటారు. కాగా అది రైల్వే స్థలంలో ఉందని, దానిని ఖాళీ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నోటీసులు జారీ చేసింది. దక్షిణ లాలాగూడాలోని ‘సాక్రెడ్ హార్ట్ చర్చి’ ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అక్రమంగా ఆక్రమించారని కారణం చూపారు నోటీసులో. ప్రాంగణంలోని 3534 చదరపు మీటర్ల ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయాలని పేర్కొన్నారు.
ఇదిలావుండగా క్రైస్తవ సముదాయం అది వెల్ డాక్యుమెంటెడ్ చర్చి అని, ఎలాంటి అతిక్రమణలు చేయలేదని వాదిస్తోంది. రైల్వే అధికారులు అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారని వాదిస్తున్నారు.
ఈ చర్చిని కేథలిక్ క్రిష్టియన్లు 1927లో నిర్మించారు. అది కూడా హైదరాబాద్ నిజామ్ కాలంలో. ఆ రోజుల్లో లాలాగూడా ప్రధాన కేంద్రంగా ఉండేది. 1947లో నిజామ్ రైల్వే కంపెనీ జాతీయం అయిపోయింది. 1951లో సెంట్రల్ రైల్వే లో భాగమైంది. ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్ లో దక్షిణ మధ్య రైల్వే జోన్ గా వర్గీకృతం అయింది.