Tuesday, November 19, 2024

మళ్లీ హైడ్రా కూల్చివేతలు

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్‌లో రోడ్డుపై నిర్మించిన భవనం కూల్చివేత

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఆక్రమ నిర్మాణాలపై మళ్ళీ కూల్చివేతలవైపు హైడ్రా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే అమీన్‌పూర్‌లోని రో డ్డుపై నిర్మించిన భవనాన్ని సోమవారం రాజీలేకుండా హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో హై డ్రా మరోసారి రంగంలోకి వచ్చిందనేది గ్రేటర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటు కూల్చివేతలు జరుగుతుండగానే చందానగర్‌లోని రెం డు చెరువులను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం పిసిబితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన చెరువుల కాలుష్య నివారణ కు రెండు సంస్థలు  సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఫిల్మ్‌నగర్‌లో ఫుట్‌పాత్‌లపై నిర్మాణాల తొలగింపు, నగర శివారు నాగారంలో రోడ్డు కబ్జా నేలమట్టం, అమీన్‌పూర్‌లో రోడ్డు ఆక్రమించిన భవనాన్ని కూల్చివేయడంతో ఆక్రమ నిర్మాణాదారుల్లో హైడ్రా భయం షురూ అయ్యింది.

ఆక్రమణలు చేయొద్దు : హైడ్రా

అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో రోడ్డుపై నిర్మించిన భవనాన్ని తనిఖీలు, అనుమతులు వంటి పరిశీలించిన అనంతరం సోమవారం కూల్చివేతలనుహైడ్రా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. జన చైతన్య రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఫిర్యాదు మేరకు లే ఔట్ ను పరిశీలించిన హైడ్రా అధికారులు ఆ భవనం రోడ్డుపై అక్రమంగా నిర్మించినట్టు నిర్ధారించుకుని కూల్చేసినట్టు తెలిపారు. 230 గ,ల స్థలంలో నిర్మించిన భవనంపై చర్యలు తీసుకున్నట్టు హైడ్రా తెలిపారు. రహదారులను, పార్కులను, ప్రభుత్వ స్థలాలను, నాలాలను, చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. ఫిర్యాదు వస్తే పరిశీలించి తొలగించడమో, కూల్చివేయడమో తప్పదని ఆయన వెల్లడించారు. రోడ్డు, పార్కులు, ఫుట్‌పాత్‌లు ప్రజలకోసం నిర్మించినవని తెలిసి కూడా ఆక్రమణలు చేయడం తీవ్రంగా పరిగణిస్తామని రంగనాథ్ హెచ్చరించారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. తక్కువ నిధులతో ఈ రెండు చెరువుల అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్. వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వారు ఎస్‌టిపి ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలలోకి మళ్లిస్తున్న తీరు చాలా బాగుందని హైడ్రా కమిషనర్ వ్యాఖ్యానించినట్టు తెలిపారు. దీప్తిశ్రీనగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో రంగనాథ్ చర్చించారు. దీప్తి శ్రీనగర్‌లో ప్రజల అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవే టు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్‌కు స్థానికుల ఫిర్యాదు చేశారు. దాదాపు 5 వేల చ.గ.ల స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక అధికారులకు కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రెగులకుంట, బక్షికుంట తరహాలోనే గ్రేటర్ పరిధిలో 10 చెరువులను మొదటిదశలో అభివృద్ది పనులు చేపడతామని కమిషనర్ వెల్లడించారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

పీసీబితో హైడ్రా భేటీ..

ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువుల కాలుష్య నియంత్రణకు పీసీబితో హైడ్రా సంప్రదింపులు జరిపినట్టు కమిషనర్ వెల్లడించారు. ఔటర్ లోపలివైపులోని చెరువులను పరిరక్షించడమే కాదు.. చెరువులు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టంచేశారు. చెరువులను భౌగోళికంగా కాపడటంతో పాటు పర్యావరణ హితంగా చెరువులను మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి)తో కలసి పనిచేయాలని హైడ్రా నిర్ణయించినట్టు రంగనాథ్ తెలిపారు. ఈ క్రమంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పీసీబీ మెంబర్ సెక్రటరీ రవితో- కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు.

చెరువుల పరిరక్షణ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం, వరదనీటి కాలువలు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు పరిరక్షణ వంటి లక్ష్యాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. పీసీబీ పని తీరును మెంబర్ సెక్రటరీ జి.రవి వెల్లడించారు. చెరువుల్లోకి, మురుగు, వరద నీటి కాలువలోకి పారిశ్రామిక, వ్యర్థాలు, కాలుష్యం రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ రెండు విభాగాలు ఒక అవగాహనకు వచ్చినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు డంప్ చేయకుండా గట్టి నిఘా పెట్టడానికి పిసిబి, హైడ్రా విభాగాల సిబ్బందితో నిఘాను పటిష్టంచేయాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News