న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పదవిలో తెలుగు అధికారి నియమితులయ్యారు. అమలాపురానికి చెందిన ఐఏఎస్ అధికారి కె.సంజయ్ మూర్తి కాగ్ కొత్త చీఫ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం కె. సంజయ్ మూర్తి కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 21న ఆయన కాగ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కాగ్ చీఫ్ గా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీకాలం నవంబర్ 20తో ముగియనున్నది. దాంతో కేంద్రం సంజయ్ కుమార్ ను ఆయన స్థానంలో నియమించింది.
సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24న జన్మించారు. ఆయన అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి కుమారుడు. 1989లో సివిల్స్ లో హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికయ్యారు.