చెన్నై: పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో హిందీని రుద్దే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు స్థానిక ప్రజలు, నాయకులు వ్యతిరేకిస్తున్నా మానడం లేదు. తాజాగా ఇప్పుడు హిందీలో ఎల్ఐసి వెబ్ సైట్ తేవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ భాష ఎంచుకునే ఆప్షన్ కూడా హిందీలోనే పెట్టడంపై మండిపడ్డారు. తన ఆగ్రహాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారతీయులందరి సహకారంతోనే ఎల్ఐసి అభివృద్ధి చెందిందని, అలాంటి సంస్థ వెబ్సైట్ లో ప్రాంతీయ భాషలని తొలగించడం అన్యాయం అన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హిందీని రుద్దడాన్ని(ఇంపోజిషన్) ఆపాలన్నారు. ఆయన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
The chief minister of Tamil Nadu @mkstalin has condemned the LIC website's choice to display Hindi instead of English. On X MK. Stalin's shared ⬇️
This is nothing but cultural and language imposition by force, trampling on India's diversity. LIC grew with the patronage of all… pic.twitter.com/u9GKXjWD13
— TN Streamline (@TNStreamline) November 19, 2024