Wednesday, November 20, 2024

అయ్యప్ప భక్తులకు శుభవార్త….. శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 18 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో మౌలా అలి కొల్లాం (07143), డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో కొల్లాం మౌలా అలీ (07144), డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నం కొల్లాం (07145), డిసెంబర్ 4, 11, 18 తేదీల్లో కొల్లాం మచిలీపట్నం (07146), డిసెంబర్ 23, 30 తేదీల్లో మచిలీపట్నం కొల్లాం (07147), డిసెంబర్ 25, జనవరి 1 తేదీల్లో కొల్లాంమచిలీపట్నం (07148) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది.

మౌలా అలీ కొల్లాం మౌలా అలీ ప్రత్యేక రైలు చెర్లపల్లి, భోన్‌గిర్, జనగావ్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, పలక్కాడ్, త్రిసుర్, అలువ, ఎర్నాకులం టౌన్, ఏటుమానూర్, కొట్టాయమ్, చెంగనచెరి, తిరువల్ల, చెంగనూర్, కాయాకులం స్టేషన్‌లలో ఆగుతుందని వెల్లడించింది. మచిలీపట్నం కొల్లామ్‌మచిలీపట్నం ప్రత్యేక రైలు పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూర్, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోల్, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూర్, రేణిగుంట, కట్‌పడి, జోలార్‌పెట్టాయి, సలెం, ఈ రోడ్, తిరుపూర్, కోయంత్తూర్, పలక్కాడ్, త్రిసుర్, అలువ, ఎర్నాకులం టౌన్, ఎట్టుమన్నూర్, కొట్టాయం, చెంగనచేరి, తిరువల్ల, చెంగనూర్, కాయంకులం స్టేషన్‌లలో ఆగుతుంది. ప్రత్యేక రైళ్లకు ఈ నెల 20 నుండి అడ్వాన్డ్ బుకింగ్ ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News