Wednesday, November 20, 2024

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట

- Advertisement -
- Advertisement -

ఎయిర్సెల్ మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. దీంతో ఆయనపై విచారణకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిదంబరం హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనపై విచారణను నిలిపివేసింది. చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ ఒప్పందంలో పారిస్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమం లోనే చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ రెండు వేర్వేరు ఛార్జిషీట్లను 2018 లో దాఖలు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News