డిజిటలైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్ మార్కును నెలకొల్పినట్టయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తంగా 80.6కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా, ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగిపోయాయని పేర్కొంది. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ప్రకారం … ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్‌కార్డుల డిజిటలీకరణ పూర్తయింది. దేశ వ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాలకు ఈ ఫోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
వీటి సాయంతో 99.8 శాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయగా, 98.7 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయింది. మరోవైపు ఈ కేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకు 64 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది. ఆహార పదార్థాల సరఫరా విషయం లోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పకడ్బందీగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.న సరకు రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నూ రైల్వేలతో అనుసంధానించామని తెలిపింది. ఇక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంతో లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరకులు తీసుకునే అవకాశం కలిగిందని తెలిపింది.