Saturday, December 21, 2024

మీకూ కుటుంబం ఉంది కదా : వైఎస్ జగన్

- Advertisement -
- Advertisement -

మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి… మీకూ కుటుంబం ఉంది కదా…తల్లి, చెల్లి పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన సోదరి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబూ..నీ తల్లిదండ్రులెవరో ప్రజలకు చూపించావా? : చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రజలకు చూపించారా? అని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారా? కనీసం వారికి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా ఇంటికి పంపించారా? వారు చనిపోతే కనీసం తలకొరివి పెట్టారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని, ఏ గడ్డి అయినా తింటారని, ఏ అబద్ధమైనా ఆడుతారని, ఏ మోసమైనా చేస్తారని ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News