Tuesday, December 3, 2024

గిల్ గాయంపై వీడని సస్పెన్స్!

- Advertisement -
- Advertisement -

పెర్త్: ఆస్ట్రేలియాతో బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్ ఆరంభానికి ఒక రోజు మాత్రమే మిగిలివున్నా భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయానికి సంబంధించి ఎలాంటి స్పష్టత రావడం లేదు. అతను తొలి టెస్టులో ఆడతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగాల్సి ఉంది. కానీ శుభ్‌మన్ గాయం గురించి జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

వార్మప్ మ్యా చ్ సమయంలో గిల్ చేతికి గాయమైంది. అప్పటి నుంచి అతను ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నాడు. తొలి టెస్టులో అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలోనూ జట్టు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తొలి టెస్టు ఆడడంపై ఇంకా సస్పెన్స్ నెలకొనే ఉంది. తాజాగా గిల్ విషయంలోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News