Friday, November 22, 2024

నెతన్యాహు, గాలంట్, హమాస్ అల్-మస్రీకి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్లు జారీ

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, హమాస్ నాయకుడు ముహ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్ మస్రీలపై యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు ‘రాయిటర్స్’ రిపోర్టు చేసింది.

ఇజ్రాయెల్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధిని తిరస్కరించింది,గాజాలో యుద్ధ నేరాలను తిరస్కరించింది. వైమానిక దాడిలో ముహ్మద్ దీఫ్ అని కూడా పిలువబడే అల్-మస్రీని హతమార్చినట్లు పేర్కొంది, అయితే హమాస్ వాదనలు దీనిని ధృవీకరించనూలేదు లేదా తిరస్కరించనూలేదు.

ఇజ్రాయెల్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సభ్యదేశం కాదు. ఇజ్రాయెల్ దేశం గతంలో తనంతట తాను దర్యాప్తు చేయడానికి చాలా కష్టపడిందని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

అక్టోబర్ 7, 2023న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాదాపు 1,200 మందిని, అత్యధికంగా పౌరులను చంపి, మరో 250 మందిని అపహరించడంతో యుద్ధం ప్రారంభమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News